రేపటి వరకు పలు జిల్లాల్లో వర్షాలు!

తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన  చేసింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో రేపు ఉదయం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕