తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు చేసింది. పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30గంటల వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రానున్న 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.