హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెహదీపట్నం, జూబ్లీహిల్స్, గండిపేట, టోలిచౌకి, షేక్‌పేట, లంగర్ హౌస్, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో వచ్చే ఒక గంటలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.