తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాలలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.