TG: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని TG వెదర్మ్యాన్ అంచనా వేశారు. ఈ మేరకు మంచిర్యాల, ఖమ్మం, యాదాద్రి, నిర్మల్, భద్రాద్రి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు.