కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. TGలోని ఆదిలాబాద్, భూపాలపల్లి, గద్వాల్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నల్గొండ, వనపర్తి, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి చేసింది. అలాగే APలోని కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕