TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భద్రాద్రి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది కాగా శుక్రవారం అత్యధికంగా మల్కాజిగిరి జిల్లా కీసరలో 11.1సె.మీ వర్షపాతం నమోదైంది.