తెలంగాణవ్యాప్తంగా మొదలైన వర్షం

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కామారెడ్డితోపాటు దోమకొండ, బిక్కనూర్, పాల్వంచ రాజంపేట, రామారెడ్డి మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అయితే దంచికొట్టిన వర్షానికి కల్లాల్లోనే ఉన్న వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరదనీటిలో కొట్టుకుపోతుంటే కన్నీరు పెట్టుకుంటున్న రైతన్నలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్