సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగమైన ‘రంగం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేస్తూ, దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడే భారం తనదేనని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. ‘‘మీరు పిల్లలను విడిచిపెడుతున్నా, నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను’’ అంటూ భక్తులపై ప్రేమను వ్యక్తం చేశారు.