పోర్నోగ్రఫీపై పన్నుతో యుద్ధ నిధుల సమీకరణ

రష్యాతో యుద్ధానికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ రంగంపై పన్ను విధించడం ద్వారా ఏటా 25 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని పార్లమెంటరీ కమిటీ అంచనా వేసింది. యుద్ధం కోసం ఏటా 120 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఆదాయ వనరు కీలకమని అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిధులతో ఏటా 30 వేల డ్రోన్‌లను సమకూర్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕