సమంతను పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు తిరుపతి వాసే

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కాగా రాజ్ ఏపీలోని తిరుపతి వాసి. ఆయన తల్లి రమాదేవి.. ఎస్పీడబ్ల్యూ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. తండ్రి రామకృష్ణ ఎస్వీ డైరీ ఫామ్ ఉద్యోగి అని సమాచారం. తిరుపతి కేజెక్స్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన రాజ్ పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి విద్యా సంస్థల్లో ఇంటర్ పూర్తి చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి 1994లో మెకానికల్ ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. కొన్నాళ్లు అమెరికాలో పని చేశారు. సినిమాపై ఉన్న ఆసక్తితో మిత్రుడు డీకేతో కలిసి సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు.

సంబంధిత పోస్ట్