బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. BJPపై అసంతృప్తితో ఎమ్మెల్యే పదవికి కూడా రాజాసింగ్ రాజీనామా చేస్తారా? లేక MLAగా కొనసాగుతారా? ఇంకేదైనా పార్టీలో చేరుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అటు తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఆయనను రాజీనామా చేయాలని BJP డిమాండ్ చేస్తుందా? అన్న చర్చ కూడా మొదలైంది.