రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు: మంత్రి వెంకట్ రెడ్డి

TG: మునుగోడుకు చెందిన మహిళకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వం తరపున రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు. ఆయన ఉండగా నేనేం చేయగలను. నా దగ్గర డబ్బులు ఏం లేవు. నేనే గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నా. నేనైతే రూ.50 వేలు సాయం చేస్తా. అదే రాజగోపాల్ రెడ్డిని అడుగు అన్ని చూసుకుంటాడు' అని సరదాగా వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్