తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన వినమ్రతతో మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో జరుగుతున్న 'ధర్మన్' సినిమా షూటింగ్ లొకేషన్‌కు ఆయన సాధారణ ఆటోలో వచ్చారు. మెరూన్ షర్ట్, దోతి ధరించి లగ్జరీ కారును వదిలి ఆటోలో వచ్చిన రజనీకాంత్, అభిమానులకు నమస్కరిస్తూ అభివాదం చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మూవీ మూడో షెడ్యూల్ సోమనాథపురం కేశవ ఆలయ ప్రాంగణంలో చిత్రీకరణ జరుగుతోంది.