సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది వీరిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన 'జైలర్' చిత్రానికి సీక్వెల్. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని సన్ పిక్చర్స్ ఒక వీడియో ద్వారా తెలియజేసింది.