రజినీకాంత్‌ భార్యకు రాజ్యసభ పదవి!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ భార్య లతా రజినీకాంత్‌కు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందంటూ తమిళనాట ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రజినీకాంత్‌ దంపతులతో చర్చలు జరిపినట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80 ప్రకారం కళలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేయవచ్చు. లతా రజినీకాంత్‌ సామాజిక సేవ, విద్యారంగంతో అనుబంధం నేపథ్యంలో ఆమె పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

సంబంధిత పోస్ట్

✕
✕