అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో అంతర్జాతీయ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒకేసారి 37 మంది కళాకారుల నటనను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రియల్ టైమ్‌లో చిత్రీకరించినందుకు ఈ ఘనత దక్కింది. తాజాగా, ఈ సినిమా మేకింగ్ గ్లింప్స్‌ను అల్లు అర్జున్ పంచుకున్నారు.