మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యతను స్వీకరించారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఈ హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించిన ప్రతిపాదనను ఆయన ఆమోదించారు. ఈ పథకం కోసం రామ్ చరణ్ సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. సినీ షూటింగ్‌లలో రిస్క్ తీసుకునే డ్యాన్సర్లు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ముందడుగు వేశారు. తన భార్య ఉపాసనతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నిర్ణయంపై డ్యాన్సర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.