రెమ్యునరేషన్లు పెంచి.. డబ్బు రాబట్టాలనుకోవడం సరికాదు: ఆర్జీవీ

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, తనకు ఆసక్తి ఉన్న సినిమాలను మాత్రమే థియేటర్లలో చూస్తానని, లేదంటే పైరసీలో చూస్తానని ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పైరసీతో నిర్మాతలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆడియన్స్ తక్కువ ధరకే దొరికే వాటినే చూస్తారని, పైరసీని ఆపితే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే కాస్త ఎక్కువ వస్తాయని, భారీ నష్టమేమీ ఉండదని వర్మ పేర్కొన్నారు. రెమ్యునరేషన్లు పెంచుకుని ప్రేక్షకుల నుంచి డబ్బు రాబట్టాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్