అల్లూరి సీతారామరాజు 1916 ఏప్రిల్ 26న ఉత్తర భారత యాత్రకు బయలుదేరి, బెంగాల్‌లో సురేంద్రనాథ్ బెనర్జీ వద్ద ఉన్నారు. లక్నో కాంగ్రెస్ మహాసభకు హాజరై, కాశీలో సంస్కృతం చదివారు. బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్ సందర్శించి, బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష తీసుకున్నారు. ఆయుర్వేదం, అశ్వశాస్త్రం, గజశాస్త్రం వంటి గ్రంథాలు వ్రాశారు. 1918లో కృష్ణదేవీపేట చేరి, ధారకొండపై తపస్సు చేశారు. అక్కడ చిటికెల భాస్కరుడు ద్వారా ఆయన తల్లికి ఆచూకీ తెలిసింది.