CM రేవంత్‌కు రామచందర్‌రావు బహిరంగ లేఖ

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ CM రేవంత్‌కు రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచందర్‌రావు బహిరంగ లేఖ రాశారు. '2023 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీ హామీలు పూర్తి చేస్తామని 600ల రోజులైనా హామీలు పూర్తి కావడంలేదు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్