దేశంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ‘రామాయణ’ రికార్డు సృష్టించనుంది. రెండు పార్టులుగా రూపొందనున్న ఈ సినిమాకు రూ.4వేల కోట్లు ఖర్చవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. ఇప్పటికే గ్లింప్స్‌కు భారీ స్పందన లభించింది. పార్ట్-1ను 2026 దీపావళికి, పార్ట్-2ను 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. IMDb లిస్టులో కల్కి రూ.600 కోట్లు, RRR రూ.550 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రాలుగా ఉన్నాయి.