‘రామాయణం’ మూవీ పబ్లిక్ టాక్

రణబీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రలలో నటించిన పౌరాణిక ఇతిహాస చిత్రం ‘రామాయణం’ ఇవాళ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఉదయం నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా సూపర్ హిట్ అని ఎక్స్ వేదికగా ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. డైరెక్టర్ నితీశ్ తివారీ ‘రామాయణం’ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుందని, అద్భుతమైన విజువల్స్, నటీనటుల యాక్టింగ్ సినిమాను నిలబెట్టాయని అంటున్నారు. ముఖ్యం రావణాసురుడిగా యష్ యాక్టింగ్ ఇరగదీశాడని చెబుతున్నారు. యుద్ధ సన్నివేశాలు మరింత ఆకట్టుకుంటాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕