ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లో భాగంగా ‘రామ’ పేరుతో రాబోతున్న టీజర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియరెన్స్ ఇచ్చింది. ఈ టీజర్ నిడివి 2 నిమిషాల 38 సెకన్లు కాగా, దీనికి యూనివర్సల్ (‘U’) రేటింగ్ లభించింది. ఏప్రిల్ 2న టీజర్ విడుదల కానుంది. ఈ చిత్రం 2026 నవంబర్‌లో దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు.