అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు బ్రతికి బయటపడ్డాడు. ఏఐ-171 ఫ్లైట్‌లోని 11A సీటులోని ప్రయాణికుడు 38 ఏళ్ల రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యువును జయించుకుని బ్రతికి బయటపడ్డట్లు అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ తెలియజేశారు. విమానం ప్రమాదం అనంతరం రమేష్ లేచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదంలో బ్రతికి బయటపడి రమేష్ మృత్యుంజయుడుగా నిలిచాడు.