వేదికపైనే కుప్పకూలి రాంలీలా నటుడు మృతి (VIDEO)

హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో బుధవారం రాత్రి రాంలీలా ప్రదర్శనలో విషాదం చోటుచేసుకుంది. 70 ఏళ్ల అనుభవజ్ఞుడైన నటుడు అమరేష్ మహాజన్, దశరథ మహారాజు పాత్రలో నటిస్తుండగా వేదికపైనే కుప్పకూలి మరణించారు. గత 25 ఏళ్లుగా రాంలీలా నాటకాల్లో నటిస్తున్న ఆయన.. దశరథుడు, రాముడి పాత్రలకు ప్రసిద్ధి చెందారు. సుమారుగా 8:30 గంటల సమయంలో సింహాసనంపై కూర్చుని సంభాషణలు చెబుతున్నప్పుడు ఆయన అకస్మాత్తుగా పక్కకు ఒరిగిపోయారు. చివరికి ఆయన మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్