AP: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు, కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వరి పంటకు శ్రీకారం చుట్టారు. రాములోరి కళ్యాణానికి, మహా యజ్ఞానికి వానర సేన వేషధారణతో భక్తులు దుక్కి దున్ని, వరి విత్తనాలను రామనామ స్మరణతో జల్లారు. ఈ వరి విత్తనాలను భద్రాచలం, అయోధ్య, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలకు కోటి తలంబ్రాలుగా పంపిస్తారు.