హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేటలో గురువారం విషాదం చోటు చేసుకుంది. హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన ఎల్‌కేజీ విద్యార్థిని రిత్విక (4) బస్సు కింద పడి మరణించింది. బాలిక బస్సు దిగి వెళ్తుండగా డ్రైవర్ బస్సును రివర్స్ చేశాడు. ఈ క్రమంలో బాలిక బస్సు కింద పడి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.