చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ పై కమిషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కారులో గంజాయి తరలిస్తుండగా నిందితుడు జాదవ్ శివరామ్ పట్టుబడ్డాడు. అతడి నుంచి 200 కేజీల పొడి గంజాయిని పోలీసుకు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కార్, సెల్ ఫోన్స్ విలువ రూ. 50 లక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.