భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఫైజ్ ఖురేషికి తన భార్య ఖమర్ బేగంకు సోమవారం అర్థరాత్రి గొడవ జరిగింది. సహనం కోల్పోయిన ఖురేషి కత్తితో భార్య గొంతుకోసి చంపాడు. అనంతరం ఆమె శవాన్ని తగలబెట్టి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు రావడంతో భయపడిన ఖురేషి నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.