హైదరాబాద్‌లోని పాతబస్తీలో కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల కల్తీ తేనెను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రెండు కార్లను సీజ్ చేసి, ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో నగరంలో కల్తీ వ్యాపారంపై ఆందోళన వ్యక్తమవుతోంది.