హాంకాంగ్ నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) అక్రమంగా తరలిస్తున్న సుమారు 7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్‌కు చెందిన దీపక్ జోస్‌కుట్టి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను ఎవరు అందించారు, ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. విమానాశ్రయాల్లో నిఘాను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.