చేవెళ్ల మండలంలోని ముడిమాల కంచెలో (ఫారెస్ట్ లో) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. రవి రెండు సంవత్సరాల నుంచి నార్సింగ్ లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ముడిమ్యాల కంచంలోకి వచ్చి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తన స్నేహితులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.