డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ రన్‌లో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ

డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ 5K రన్‌లో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నగరాన్ని మత్తు రహితంగా మార్చడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదిలోనే వాటిని అంతం చేస్తే అందరికీ మేలు జరుగుతుందని ఆయన సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ వంటి నగరాల్లో రన్, మారథాన్ వంటి కార్యక్రమాలు శారీరకంగా దృఢంగా మారడానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్