రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మొకిల ఎక్స్పీరియంలో ‘రన్ ఫర్ కల్చర్ – రన్ ఫర్ చేంజ్’ పేరుతో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం లక్ష్యంగా ఒక రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, 5 కిలోమీటర్ల రన్‌లో యువతతో కలిసి పాల్గొన్నారు. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని వీడాలని, మార్పు ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు.