బ్రెడ్‌లో చనిపోయిన బల్లి

శంకర్‌పల్లి జాన్వాడలో బ్రెడ్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో కలకలం రేగింది. స్థానిక కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన బ్రెడ్‌ను అశోక్ తన కుమారుడికి తినిపిస్తుండగా అందులో బల్లిని గుర్తించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్