ఘోర రోడ్డు ప్రమాదం.. టూ వీలర్ రైడర్‌కు తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి, పర్వేద గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్‌పల్లి వైపు నుండి అతివేగంగా వస్తున్న ఆటో, పర్వేద గ్రామం నుండి శంకర్‌పల్లికి వెళ్తున్న టూ వీలర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూ వీలర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, కాలు విరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బైక్ నంబర్ AP 28 BW 6576 కాగా, ఆటో నంబర్ TG 34 T 5733గా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని శంకర్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్