బుధవారం తెల్లవారుజామున కడ్తాల్ మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. వెంకటాపూర్ తండా నుండి హైదరాబాద్‌కు నలుగురు యువకులు బయలుదేరగా, మాక్తమాదారం గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు యువకులంతా వెంటనే కారు దిగి సురక్షితంగా బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కారు దాదాపు 80% వరకు మంటల్లో దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.