ఉచిత మంచినీటి సరఫరా ప్రారంభం

చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లి వార్డులో ఎన్నికల హామీల అమలులో భాగంగా, కౌన్సిలర్ మీనాక్షి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధి చేసిన మంచినీటి సరఫరా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, భూత్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్