ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీ పటేల్ గూడకు చెందిన కీలుకత్తి నరసింహ గౌడ్ (45) రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో దానికి తోడు కుటుంబ కలహాలతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.