రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ లోని కేతిరెడ్డి పల్లి గ్రామంలో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆమె హత్యతో న్యాయవాద సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనపై న్యాయవాది కొంగళ్ల నవీన్ మాట్లాడుతూ, "చట్టాన్ని కాపాడే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరం. న్యాయవాదుల భద్రతను నిర్ధారించడంలో వ్యవస్థ విఫలమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి 'అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు' ను వెంటనే చట్టరూపంలోకి తీసుకురావాలి" అని డిమాండ్ చేశారు. ఈ హత్య న్యాయవాదుల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.