ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా డేవీదాస్ సోపన్రావు గవాటే (46) అనే టైలర్ శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర నాందేద్ ప్రాంతానికి చెందిన ఇతను అబ్దుల్లాపూర్మెట్ లోని బీసీ కాలనీలో నివాసముంటూ టైలర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్