మొయినాబాద్ డ్రగ్స్ కేసు: పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మార్చి 14న రాత్రి మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో పోలీసులు రెయిడ్ చేసి, డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపినట్లుగా ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో పలువురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్