బైకు చెట్టును ఢీకొని ఒకరి మృతి

చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతారం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బేగరి వెంకటయ్య (32) అనే యువకుడు మృతిచెందాడు. షాబాద్ మండలం హైతాబాద్లోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వెంకటయ్య, శుక్రవారం సాయంత్రం పని మీద మండల కేంద్రానికి వెళ్లి, రాత్రి 7 గంటల సమయంలో గ్రామానికి తిరిగి వస్తుండగా, గ్రామానికి సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా, శనివారం చికిత్సపొందుతూ మృతిచెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్