పేకాట స్థావరంపై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, భగత్ సింగ్ నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వాహకుడితో పాటు ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 99,880 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ పేకాట స్థావరంపై అందిన సమాచారం మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్