కుండ పోత... రైతుకు గుండె కోత

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కోతకొచ్చిన పంటలు వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్లముందే తమ పంటలు నాశనం కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్