రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు

చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, బ్రెజ్జా కారు ఢీకొని పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన పట్టేల్ ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ప్రవీణ్‌ను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పెళ్లి కార్డులు పంచడానికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం గురయ్యాడు. ఈ ఘటనలో క్షతగాత్రుడికి కాలు విరిగిపోగా, తలకు బలమైన గాయాలు అయ్యాయి.

సంబంధిత పోస్ట్