స్నేహితులను భయపెట్టడానికే ఆత్మహత్య స్టేటస్.. యువకుడిపై కేసు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చెందిన సమీర్ (29) అనే యువకుడు కాచిగూడలో తన స్నేహితుడిని కలవడానికి వచ్చాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సప్‌లో స్టేటస్ పెట్టడంతో, కాచిగూడ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులను భయపెట్టడానికే అలా చేశానని అతను పోలీసులకు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్