2025 సంవత్సరంలో జరిగిన పదవ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనానికి సంబంధించిన డబ్బులు నేటికీ విడుదల చేయలేదని, మూల్యాంకన కేంద్రాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. 2018 నుండి ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన రేట్లు రెండుసార్లు పెంచినా, పదవ తరగతికి మాత్రం పెంచలేదని వారు ఆరోపించారు. మూల్యాంకన రేట్లు పెంచి, ఈ సంవత్సరానికి సంబంధించిన పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ SSC పరీక్షల విభాగం డైరెక్టర్ పి.వి.శ్రీహరికి TUTF రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల చీర, పి.రఘునందన్ రెడ్డిలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ లో జరిగింది.