సిలిండర్ పేలిపోలేదు, మంచిగానే ఉంది: బాధితురాలు

సరూర్ నగర్ లో జరిగిన భారీ పేలుడు కలకలం సృష్టించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, అకస్మాత్తుగా సంభవించిన పేలుడు ధాటికి గోడలు, తలుపులు కూలిపోయాయి. మొదట భూకంపం వచ్చిందేమోనని భయపడ్డానని, ఇల్లంతా పొగ, దుమ్ముతో నిండిపోయిందని ఆమె వాపోయారు. సిలిండర్ పేలలేదని, అది సురక్షితంగానే ఉందని పేర్కొన్నారు. పేలుడు వల్ల ఫ్రిడ్జ్, అల్మారా చెల్లాచెదురు అయ్యాయని, అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియదని బాధితురాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్